‘అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు’

AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్ల వైసీపీ ఆరాచక పాలనను భరించలేకే ప్రజలు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్‌ను ఇంటికే పరిమితం చేశారన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల కోసం పనిచేసే నాయకుడని కొనియాడారు. సూపర్ సిక్స్ పథకాలపై జగన్ వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు.