VIDEO: ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం..!

మేడ్చల్: ఉప్పల్, నాచారం, చిలుకానగర్, మల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గత అర్థగంట సమయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయంగా మారాయి. మరోవైపు అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గణేష్ నగర్, కావేరి నగర్ ప్రాంతాల్లో అనేకచోట్ల రోడ్లపై నీరు నిలిచింది.