VIDEO: కల్లూరు ముజఫర్ నగర్‌లో రహదారులపై సీపీఎం ఆందోళన

KRNL: కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజఫర్ నగర్ నీళ్ల ట్యాంకు వద్ద మాదిరాజు నగర్ రోడ్డులో గుంతల కారణంగా ఆటోలు, ద్విచక్రవాహనాలు, విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారని సీపీఎం పార్టీ నాయకులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల వల్ల పందిపాడు ఇందిరమ్మ కాలనీ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అధికారులు వెంటనే రోడ్లు వేసి, మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.