VIDEO: నకిలీ హెల్త్ కార్డుల దందా.. కేటుగాళ్ల బంధీ
SRPT: ‘ఆయుష్ సర్వీసెస్’ పేరిట సూర్యాపేట మండలం బాలెంలలో నకిలీ హెల్త్ కార్డుల దందా ఇవాళ వెలుగుచూసింది. కార్డుకు రూ.500 వసూలు చేస్తూ. 150 మందిని మోసం చేస్తున్న కేటుగాళ్లను గ్రామస్తులు పట్టుకుని పంచాయతీ వద్ద బంధించారు. అధికారుల వివరణ కోరుతూ నిరసనకు దిగారు. ఇలాంటి మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ యువత డిమాండ్ చేస్తోంది.