జిల్లాలో భారీ చోరీ

జిల్లాలో భారీ చోరీ

NZB: మహాలక్ష్మినగర్ నాగాటవర్స్‌లో నివాసం ఉంటున్న విఠల్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి విఠల్ ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు కిటికీ గుండా ప్రవేశించి బెడ్ రూంకు గడియ పెట్టారు. మరో బెడ్ రూంలోని బీరువాను పగులగొట్టి 12 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.