VIDEO: పరిశ్రమ గేటు వద్ద మృతదేహంతో నిరసన

VZM: పూసపాటిరేగ మండలంలోని ఓ ఫార్మా కంపెనీ వద్ద ఇవాళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంపడాం గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీను కంపెనీలో కెమిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం అస్వస్థతకు గురికావడంతో యాజమాన్యం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ రోజు పరిస్థితి విషమించడంతో శ్రీను మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కంపెనీ ముందు మృతదేహంతో నిరసనకు దిగినట్లు తెలిపారు.