'ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలి'
MNCL: జన్నారం మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. జన్నారంలోని వినాయక్ నగర్‌కు వెళ్లే దారిలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క తాహసీల్దార్ కార్యాలయానికి మాత్రమే ప్రహరీ కూడా లేదు. కార్యాలయం బహిరంగ ప్రదేశంలో ఉండడంతో రక్షణ కరువైంది. కార్యాలయం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలని ప్రజలు కోరారు.