బొబ్బిలిలో ఆసక్తికర సన్నివేశం
VZM: బొబ్బిలిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో శుక్రవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రకృతి పద్ధతుల్లో పండించిన చెరుకుతో తయారు చేసిన బెల్లంను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్వయంగా కొనుగోలు చేశారు. కలెక్టర్ చర్యతో సహజ వ్యవసాయం చేస్తున్న రైతుకు ప్రోత్సాహం లభించడంతో పాటు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వినియోగించాలనే సందేశం అందించారు.