ఆక్రమణలు తొలగించిన పోలీసులు
VZM: ఎస్‌కోటలోని దేవి బొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్డు వద్ద సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.