చెరువుల ఆక్రమణలకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ
JN: చెరువులు, కుంటలను ఆక్రమణల నుంచి కాపాడేందుకు 'లేక్ ప్రొటెక్షన్ కమిటీ' రంగంలోకి దిగింది. గత నెల 13న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అధ్యక్షతన జరిగిన కమిటీ మొదటి సమావేశంలో నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగర పరిధిలోని మొత్తం 73 జల వనరులను తక్షణమే పరిరక్షించాలని కమిటీ నిర్ణయించింది.