'సమస్యల పరిష్కారానికి వారధిగా పని చేయాలి'
ADB: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగి వారధిలా పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బీసీ జిల్లా అభివృద్ధి అధికారిగా పనిచేసిన రాజలింగు మంగళవారం పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరైయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాజలింగు బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అందజేసి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు.