స్థానిక పోరుకు సమాయత్తం
KMM: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 571 పంచాయతీల్లో 5,214 వార్డులు, అదే సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,572 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు.