అక్కడ మొక్కితే కోరికలు నెరవేరుతాయి..!

అక్కడ మొక్కితే కోరికలు నెరవేరుతాయి..!

KMR: గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలో ఉన్న మహాదేవుని ఆలయం ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అతి పురాతన శివలింగాన్ని దర్శించుకుని మనసారా మొక్కుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఏ ముఖ్యమైన పనైనా ఇక్కడ పూజ చేసిన తర్వాతే ప్రారంభిస్తారు.