'పేద మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ భరోసా'

JGL: ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ భరోసా అని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగా రావు అన్నారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సుమారు రూ.9.49 లక్షల విలువైన 22 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.