ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

MLG: తాడ్వాయి మండలం మేడారం గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఆలకుంట రమేష్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమేష్ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే మృతి చెందడం జరిగింది.