'ప్రణాళిక సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి'
SRCL: ఈనెల 16న మండల, మున్సిపల్ స్థాయిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సభల నిర్వహణ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధించిన ప్రగతిపై ప్రజలకు వివరించాలన్నారు.