'అదిలాబాద్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలి'
ADB: ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ముందుకు తీసుకువెళ్లాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో సమావేశమై మాట్లాడారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని ఆమె పేర్కొన్నారు.