VIDEO: జగ్గంపేటలో దళిత సంఘాల ఆందోళన

VIDEO: జగ్గంపేటలో దళిత సంఘాల ఆందోళన

KKD: దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ జగ్గంపేటలో దళిత సంఘాలు, టీడీపీ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ నగర్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతబాబును, ఆయన భార్యను వెంటనే అరెస్టు చేయాలన్నారు.