KGBVని సందర్శించిన అదనపు కలెక్టర్
MNCL: సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక డ్రైవ్ సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. నస్పూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం తనిఖీ చేశారు. విద్యాలయంలో వంటశాల, ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే ఆహార పదార్ధాలు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలన్నారు.