నేలకొండపల్లిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KMM: నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ నేతలతో కలిసి మార్కెట్ ఛైర్మన్ సీతారాములు జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన చేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.