నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NDL: ప్యాపిలి పట్టణ పరిధిలో 11కేవీ కొత్త లైన్ నిర్మాణ పనులు చేపడుతున్న కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్ కో ఏఈ వినయ్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.