ఈనెల 21 వరకు ఓపెన్ స్కూల్ గడువు పెంపు

SRD: ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ ఈనెల 21వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ సమన్వయకర్త వెంకట స్వామి తెలిపారు. సంగారెడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో చదవవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.