23నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

23నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

భద్రాద్రి: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 23నుంచి ఆరు రోజులపాటు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ మేనేజరు పీవీ. రమణ పేర్కొన్నారు. బుధవారం ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లు, వసతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వనమా గాంధీ, నేరెళ్ల లాలయ్య తదితరులు పాల్గొన్నారు.