హీట్‌వేవ్ నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్

హీట్‌వేవ్ నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్

WGL: జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హీట్‌వేవ్ ప్రభావం తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య శారద బుధవారం అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని, అవసరమైతే ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. షేడ్‌లు, వైద్య సేవలు, మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.