భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు

ASR: సుమారు పది రోజులుగా ఏజెన్సీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఘాట్‌లలో చెట్లు విరిగి పడుతున్నాయి. ఈక్రమంలో భారీ వర్షాలకు కొయ్యూరు మండలానికి సమీపంలో ఉన్న రొంపుల ఘాట్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన హైవే సిబ్బంది కొండచరియలను తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు.