ఆ హామీల వల్లే ప్రజల్లో వ్యతిరేకత: సీపీఐ ఎమ్మెల్యే

ఆ హామీల వల్లే ప్రజల్లో వ్యతిరేకత: సీపీఐ ఎమ్మెల్యే

TG: ప్రభుత్వం పనులు చేస్తున్నా ప్రజల్లో నమ్మకం కలగడం లేదని సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వల్లే ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని మిత్రపక్షంగా తామే వెన్నంటి ఉండి నిలబెడుతున్నామని పేర్కొన్నారు. పథకాలు అమలు చేస్తున్నా హామీల అమలులో జాప్యం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందని వివరించారు.