ఉమ్మడి వరంగల్ మావోయిస్టు అగ్రనేతలు హతం
హన్మకొండ: జిల్లా కేంద్రంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు మరణిస్తున్నారు. ఛత్తీస్ గఢ్‌తో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలు అమరులవుతున్నారు. జనగామకు చెందిన గుమ్మడవెల్లి రేణుక, భూపాలపల్లికి చెందిన గాజర్ల రవి, వరంగల్‌కు చెందిన మోదెం బాలకృష్ణ, సుధాకర్, ఏసోలు, అన్నై సంతోశ్, సారయ్య వంటివారు ఉద్యమ బాటలో ప్రాణాలు వదిలారు.