'మహిళల సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి పునాది'

'మహిళల సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి పునాది'

KMR: దోమకొండ మండల కేంద్రంలో 'మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి' కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు.