స్వామివారి కళ్యాణానికి పటిష్ట ఏర్పాట్లు: ఈవో

KKD: శంఖవరం మండలం అన్నవరంలో ఈ నెల 7 నుంచి 13 వరకు జరగబోయే సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు మంగళవారం తెలిపారు. అన్ని విభాగాల అధికారులకు సూచనలు ఇచ్చామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కళ్యాణం రోజున స్వామివారి తలంబ్రాలు భక్తులందరికీ ఇవ్వడానికి ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.