VIDEO: నంబర్ బ్లాక్ చేసిన ప్రియురాలు.. టవర్ ఎక్కిన ప్రియుడు
BHPL: ప్రేమకోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన గణపురం మండలంలో శుక్రవారం జరిగింది. ధర్మారావుపేటకి చెందిన సూర రాజు మోరంచ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కాడు. తాను మనసు పడిన యువతి తన ఫోన్ బ్లాక్ చేసిందని, ఆమెతో వెంటనే మాట్లాడించాలని, లేదంటే కిందకు దిగేది లేదని అక్కడే కూర్చున్నాడు. పోలీసులు 2 గంటలు శ్రమించి, అతనికి నచ్చజెప్పి కిందికి దింపారు.