దేశ ప్రజల ముందు ఆడటం అదృష్టం: లవ్లీనా
2030లో జరగబోయే కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడంపై టోక్యో ఒలింపిక్స్ పతక విజేత, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ సంతోషం వ్యక్తం చేసింది. ఇది దేశానికి దక్కిన గొప్ప అవకాశం అని ఆమె పేర్కొంది. స్వదేశంలో దేశ ప్రజల ముందు ఆడటం ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తుందని తెలిపింది. ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం అని వ్యాఖ్యానించింది.