ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 80 అర్జీలు
సత్యసాయి: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 80 అర్జీలు స్వీకరించారు. ఎస్పీ అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.