త్వరలో మంత్రి వర్గ విస్తరణ..!
TG: రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. 2 ఖాళీలతో పాటు పూర్తిస్థాయి ప్రక్షాళనపై సీఎం ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులకు అవకాశం ఉందని, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.