ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం భక్తుల పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచే భక్తులు తరలిరావడంతో పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో దంపతులు వ్రతాలు నిర్వహించగా, కొందరు స్వాములు హనుమాన్ దీక్షలు చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు.