'రైతు భరోసా కోసం దరఖాస్తులు సమర్పించాలి'
MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ పరిధిలో ఉన్న కొత్త రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ఏఈఓ త్రిసంధ్య కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు రూ. 12వేల రైతు భరోసా పెట్టుబడి సహాయం అందజేస్తుందన్నారు. ఫిబ్రవరి 28 లోపు కొత్త పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, ఆర్ఓఆర్ ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.