'స్తంభాలకు విద్యుత్ వైర్లు ఉపయోగించాలి'

ADB: జన్నారం మండలంలోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న కొత్త కాలనీలో వేసిన స్తంభాలకు విద్యుత్ వైర్లను బిగించాలని స్థానిక ప్రజలు కోరారు. 15 సంవత్సరాల క్రితం ఆ కాలనీలో ప్రజలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. అప్పట్లో స్తంభాలు లేకపోవడంతో వారు కట్టెల సహాయంతో వైర్లు వేసుకొని విద్యుత్ పొందుతున్నారు. ఇటీవల కాలనీలో వేసిన స్తంభాలకు విద్యుత్ వైర్లు బిగించాలని కోరారు.