విశ్వబ్రాహ్మణులకు ఆ స్థానం ఇవ్వడంపై హర్షం

విశ్వబ్రాహ్మణులకు ఆ స్థానం ఇవ్వడంపై హర్షం

KRNL: విశ్వబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సముచిత స్థానం ఇవ్వడంపై విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు నరసింహాచారి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పెద్దకడబూరులో ఆయన మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా కమ్మరి పార్వతమ్మను నియమించడం చాలా సంతోషకరమన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.