శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

KKD: రాజానగరం మండలం నామవారం గ్రామంలో ఇవాళ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన MLA బత్తుల బలరామకృష్ణ, శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలని ఆలయ కమిటీకి తెలిపారు. అనంతరం ఆలయ సిబ్బంది బలరామకృష్ణను సత్కరించారు.