టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్

AKP: అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులు, ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతులపై అధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.