VIDEO: రాజంపేట డివిజన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అన్నమయ్య: జిల్లాపై ద్విత్వా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. తుఫానుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సహాయం కోసం 112కు ప్రజలు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.