సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

MBNR: హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన పార్వతమ్మ అపస్మారకస్థితికి వెళ్లింది. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు కాల్ చేయగా అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది బాషా, అంజిలయ్య అంబులెన్స్‌లోకి తీసుకుని సీపీఆర్ చేసి పార్వతమ్మ ప్రాణాలు కాపాడారు. ఆమెను మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నట్లు ఆర్ఎంఓ తెలిపారు.