విమానానికి బాంబు బెదిరింపు

విమానానికి బాంబు బెదిరింపు

HYD: బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబ్ బెదిరింపు కలకలం రేగింది. లండన్ నుంచి శంషాబాద్ వచ్చిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో.. విమానంలోని ప్రయాణికులను కిందకు దింపి అధికారులు తనిఖీలు చేపట్టారు.ఫ్లైట్‌లో ఎలాంటి బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ తేల్చింది. బెదిరింపు మెయిల్‌పై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.