ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖ అధికారి
కృష్ణా: మచిలీపట్నం పట్టణంలోని ఎల్ఏజిజి హై స్కూల్‌లో జరగనున్న పదవ తరగతి పరీక్షల మూల్యాంకనం సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యు. వి. సుబ్బారావు కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమన్ని సక్రమంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. దీనిలో పాల్గొనే ఉపాధ్యాయులకు అవసరమైన సదుపాయాలు, భద్రతా చర్యలు, పత్రాల నిర్వహణ, ఇతర విధి విధానాలను సమీక్షించారు.