VIDEO: అగ్ని ప్రమాదం.. కాలిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్
MNCL: జైపూర్ మండలం పెగడపల్లి-గంగిపల్లి గ్రామాల మధ్య అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రహదారికి ఇరువైపులా ఎండిపోయిన చెట్ల కొమ్మలకు నిప్పు అంటుకుంది. దీంతో మంటలు ఎగిసిపడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కాలిపోయిందని ఆపరేటర్లు వెంకన్న, శ్రీనివాస్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి వేయడం వలన మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వారు పేర్కొన్నారు.