చాక్ పీస్‌పై అంబేద్కర్ రూపం.. ఆకట్టుకుంటున్న మైక్రో ఆర్ట్
SRPT: మఠంపల్లికి చెందిన మైక్రో ఆర్టిస్ట్, ఆర్ట్ టీచర్ కొత్తపల్లి బాబు తన ప్రతిభను చాటుకున్నారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేవలం రెండున్నర ఇంచుల చాక్ పీస్‌పై అంబేడ్కర్ ప్రతిమను మలచి తన అభిమానాన్ని చాటుకున్నారు. పెదవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బాబు సృజనాత్మకతను చూసి పలువురు అభినందిస్తున్నారు.