'వరి పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోయాలి'
Srcl: వరి పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోతలు చేపట్టాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి కోత యంత్రాల యజమానులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. హార్వెస్టర్ యజమానులు వరి కోతలు చేసేటప్పుడు తప్పనిసరిగా వరి చేను పూర్తిగా పక్వానికి వచ్చిన తరువాత మాత్రమే కోయాలన్నారు.