పూలే చేసిన సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే
NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో శుక్రవారం మహాసంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, మహిళా విద్య విస్తరణ కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆమె వెంట పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.