మామిడిపండ్లు కిలో @రూ.2.50 లక్షలు

TG: వేసవిలో మామిడిపండ్లు విరివిగా దొరుకుతాయి. కిలో ధర రూ.100-200 వరకు ఉంటాయి. అయితే 'మియాజాకి' మామిడిపండ్ల ధర కిలోకు రూ.2.50 లక్షలు. వీటిని జపాన్‌లోని మియావాకి నగరంలో పండిస్తారు కాబట్టి ఈ పేరు వచ్చింది. మన దగ్గర ఖమ్మంలోని ఓ రైతు ఈ రకం మామిడిని పండిస్తున్నాడు. ఈ పండ్లు ప్రత్యేక రుచి కలిగి ఉండటమే కాక.. వీటిలోని పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.