పేదింటి పెళ్లికి నిత్యావసరాలు అందజేత

RR: పేదింటి పెళ్లికి నిత్యావసర సరుకులను అందజేసి ముదిరాజ్ యువనాయకులు తమ ఔదార్యాన్ని చాటారు. తెలంగాణ పోరాట సమితి ముదిరాజ్ అధికార ప్రతినిధి, ఎన్ఎంఆర్ యువసేన అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ముదిరాజ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన కుక్కల సత్తయ్య దంపతులకు ఇంట్లో శుభకార్యం నిమిత్తం వీటిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శమన్నారు.