'మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి'

VSP: వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమార్ స్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే ప్రతిమలను వాడొద్దని సూచించారు.